వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాలలో యుఎఫ్ ఆర్టీఐ ఆధ్వర్యంలో సమాచార హక్కు చట్టంపై అవగాహన సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎస్. వెంకటేశ్వర్లు, రాష్ట్ర మహిళా కన్వీనర్ సోమలక్ష్మి, జిల్లా కన్వీనర్ జీవన్ జోయెల్ హాజర య్యారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ఆర్టీఐ చట్టం ప్రజల చేతిలో కీలకమైన ఆయుధమని పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు సెక్షన్ 4(1)(బి) ప్రకారం పూర్తి వివరాలను స్వచ్ఛందంగా బహిర్గతం చేయాలని స్పష్టం చేశారు. అలాగే ఆర్టీఐ దరఖాస్తు రాసే విధానం, సమర్పణ, అప్పీళ్ల ప్రక్రియపై సభ్యులకు సమగ్ర అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో పలువురు యుఎఫ్ ఆర్టీఐ ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
వాస్తవ గమ్యం