వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : రాజకీయ పార్టీల కండువాలు, లెటర్ ప్యాడ్‌ల మాటున అమాయక ఆదివాసీలను భయభ్రాంతులకు గురిచేస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న చోటా నాయకులపై మనవరి ఆదివాసి నాయకపోడ్ సంఘం అధ్యక్షుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏజెన్సీ పరిధిలోని 1/70 చట్టాన్ని అడ్డం పెట్టుకుని అధికారులను బెదిరించడం, సామాన్యులను బ్లాక్‌మెయిల్ చేయడమే కొందరు పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. టార్గెట్ చేసి వేధింపులు: స్థానిక గిరిజనులు తమ సొంత భూముల్లో చిన్నపాటి నిర్మాణాలు చేపట్టినా అక్రమమంటూ అధికారులకు ఫిర్యాదులు చేయడం, తెరవెనుక సెటిల్‌మెంట్లకు తెరతీయడం పరిపాటిగా మారింది.పక్షపాత వైఖరి: ఆదివాసీల నిర్మాణాలపై రాద్ధాంతం చేసే ఈ నకిలీ నాయకులకు, బడా నేతలు చేసే అక్రమ నిర్మాణాలు ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు. చీకటి ఒప్పందాలు, ముడుపులతోనే వారి నోళ్లు మూతపడుతున్నాయని ఆరోపించారు.రాజకీయ ముసుగులో అధికారులను ఒత్తిడికి గురిచేస్తూ, అమాయక ఆదివాసీల పొట్టకొడుతున్న ఇలాంటి వ్యక్తులపై రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఏజెన్సీ హక్కుల పరిరక్షణ కోసం పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
Admin
వాస్తవ గమ్యం