Sunday, 13 September 2026 09:57:59 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలే రక్షణ కవచం: మందమర్రి ఎస్ఐ జి. నరేష్

యాపల్ ప్రాంతంలో సీసీ కెమెరాల ఏర్పాటుపై అవగాహన సమావేశం

Date : 18 July 2026 09:27 PM Views : 101

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి పరిధిలోని యాపల్ ప్రాంతంలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణే ధ్యేయంగా సీసీ కెమెరాల ఏర్పాటుపై శనివారం ఒక ప్రత్యేక అవగాహన సమావేశం నిర్వహించారు. మందమర్రి సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్ఐ) జి. నరేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో స్థానిక కాలనీవాసులు, వ్యాపారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎస్ఐ జి. నరేష్ మాట్లాడుతూ.సమాజంలో ప్రజల రక్షణకు, అసాంఘిక కార్యకలాపాల అడ్డుకట్టకు సీసీ కెమెరాలు 'మూడో కన్ను'లా పనిచేస్తాయని పేర్కొన్నారు. ప్రతి కాలనీ, ప్రధాన కూడళ్లు, వ్యాపార సముదాయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల నేరాలను ముందే నివారించవచ్చన్నారు. ఒకవేళ ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగినా, నిందితులను త్వరగా గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఈ నిఘా నేత్రాలు ఎంతో దోహదపడతాయని వివరించారు. ప్రజలందరూ బాధ్యతగా భావించి, తమ పరిసరాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు స్వచ్ఛందంగా సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు.శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీస్ శాఖ చేపట్టిన ఈ కార్యక్రమానికి స్థానిక నాయకులు, ప్రముఖులు పూర్తి మద్దతు ప్రకటించారు. యాపల్ ప్రాంతాన్ని సురక్షితంగా మార్చేందుకు తమ వంతు సహకారాన్ని అందిస్తామని స్పష్టం చేశారు.ఈ అవగాహన సమావేశంలో స్థానిక ప్రముఖులు బొద్దిరెడ్డి వెంకటరెడ్డి, ఎం.డి. అబ్బాస్, బొద్దున ఓంప్రకాష్, వనం నర్సయ్య, సంగార్తి సంతోష్, అడ్డూరి సాంబమూర్తి, పిండి సురేష్, కొమిరిశెట్టి తిరుపతి, జిల్ల రాజు తదితరులు పాల్గొని సీసీ కెమెరాల ఏర్పాటుకు సంఘీభావం తెలిపారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: