Thursday, 30 July 2026 12:44:49 AM
# ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ప్రతి ఇంటికీ మొక్కలు పంపిణీ – పచ్చని ఎదులపాడ్ నిర్మాణమే లక్ష్యం # కీ॥శే. శ్రీ సంత్ కుమ్ర దేవ్ రావు మహారాజ్ మాడిస్ పూజలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క # నీట్ పేపర్ లీకేజీ బాధిత విద్యార్థులకు కొవ్వొత్తుల ర్యాలీలో నివాళి # మద్యం మత్తులో బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ఘటన # కోదండ రామాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా భక్తుల ప్రత్యేక పూజలు # *మాజీ ఎమ్మెల్యే ఆత్రంసక్కు చొరవతో షేడ్ నిర్మాణానికి భూమిపూజ* # *ఆశ్రమ పాఠశాలలో స్మాట్ బోర్డ్ ప్రారంభించిన స్థానిక సర్పంచ్ జనేరావు. # కేటీఆర్ జన్మదినం.. సేవా కార్యక్రమాలతో బీఆర్ఎస్ నేతల వినూత్న వేడుకలు # ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ గడువులోగా పూర్తి చేయాలి:

​గంజాయి నిర్మూలనకు యువత ముందుకు రావాలి

చెన్నూరు రూరల్ సీఐ ఆర్. కృష్ణ

Date : 04 June 2026 06:20 PM Views : 81

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : కోటపల్లి:సమాజాన్ని పట్టిపీడిస్తున్న గంజాయి మహమ్మారి నిర్మూలనకు యువత నడుం బిగించాలని చెన్నూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ) ఆర్. కృష్ణ పిలుపునిచ్చారు. కోటపల్లి మండలం సర్వాయిపేట గ్రామంలో పోలీసుల ఆధ్వర్యంలో గురువారం కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.యువత గంజాయి మత్తుకు బానిసలై తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సీఐ సూచించారు. గ్రామాల్లో గంజాయి విక్రయించినా, సేవించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, ప్రజల సహకారంతోనే మత్తు పదార్థాల నిర్మూలన సాధ్యమని పేర్కొన్నారు.యువతలో క్రమశిక్షణ, ఆరోగ్యం, జట్టు భావన పెంపొందించేందుకు క్రీడలు దోహదపడతాయన్నారు. ఈ సందర్భంగా గ్రామ యువకులకు పోలీసులు రెండు వాలీబాల్ కిట్లను పంపిణీ చేశారు. సర్వాయిపేట గ్రామానికి చెందిన ఉప్పరి సాయికుమార్ అగ్నివీర్ సైనిక ఉద్యోగానికి ఎంపికవడంతో సీఐ ఆర్. కృష్ణ, ఎస్సై రాజశేఖర్‌లు అతనిని శాలువాతో ఘనంగా సన్మానించారు. సాయికుమార్‌ను గ్రామ యువత ఆదర్శంగా తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో కోటపల్లి ఎస్సై రాజశేఖర్, హెడ్ కానిస్టేబుల్ బుజ్జిబాబు, గ్రామ సర్పంచ్ రాజేష్, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు మరియు పెద్ద సంఖ్యలో యువకులు పాల్గొన్నారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: