వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : ఆసిఫాబాద్: కాగజ్‌నగర్ పట్టణంలోని ద్వారకానగర్ 8వ వార్డులో మంగళవారం లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని షాపు నంబర్ 3లో నిర్వహించారు. స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థతో పాటు వివిధ ప్రభుత్వ పథకాలకు అర్హత లభిస్తుందని అధికారులు, నాయకులు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి గజ్జల లక్ష్మణ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు యూసఫ్ ఖాన్, బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి చేరాలా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం