వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా మంచిర్యాల జిల్లాకు చెందిన బింగి ప్రవీణ్ నియమితులయ్యారు.బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు సూచనల మేరకు ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గంధమల్ల ఆనంద్ గౌడ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుల నియామకాలను ప్రకటించారు.ఈ సందర్భంగా బింగి ప్రవీణ్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఓబీసీ వర్గాల సంక్షేమం, సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, ఓబీసీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.పార్టీ సిద్ధాంతాలు, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి బీజేపీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని ప్రవీణ్ తెలిపారు.
Reporter
వాస్తవ గమ్యం