వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి పట్టణంలోని స్టేషన్ రోడ్డులో నివాసం ఉంటున్న సింగరేణి కార్మికుడు మాధవరెడ్డి ఇంట్లో బుధవారం షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇంట్లోని గృహోపకరణాలు, ఇతర సామగ్రికి నష్టం జరిగినట్లు తెలిసింది.సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తీసుకురావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Reporter
వాస్తవ గమ్యం