వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : కొమురం భీం 86వ వర్ధంతిని పురస్కరించుకుని ఈ నెల 26వ తేదీన కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు స్థానిక సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ కె.హరిత శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అయితే రెసిడెన్షియల్ పాఠశాలలకు ఈ సెలవు నుంచి మినహాయింపు ఉంటుందని స్పష్టం చేశారు.ఈ నెల 26వ తేదీ సెలవుకు బదులుగా నవంబర్ 14వ తేదీ రెండో శనివారం అన్ని పాఠశాలలు తప్పనిసరిగా పని దినంగా పాటించాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలోని విద్యాసంస్థల యాజమాన్యాలు ఈ ఆదేశాలను తప్పనిసరిగా అమలు చేయాలని సూచించారు.
Reporter
వాస్తవ గమ్యం