వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ప్రగతి ప్రణాళిక — ప్రజా పాలనా విద్యా వారోత్సవాల్లో భాగంగా ఆచార్య జయశంకర్ బడి బాట కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఆసిఫాబాద్ బాలికల ఆశ్రమ పాఠశాల, మొవాడ్, ఫరిది స్కూల్ కాంప్లెక్స్‌ల ఉపాధ్యాయులతో సమావేశం జరిగింది. జిల్లా గిరిజన సంక్షేమ శాఖ పీఎంఆర్‌సీ, ఏసీఎంఓ పూర్కా ఉద్దవ్ మాట్లాడుతూ బడి ఈడు పిల్లలు, బడి బయట పిల్లలు అందర్నీ ప్రభుత్వ గిరిజన ప్రాథమిక పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలల్లో చేర్పించాలని స్పష్టం చేశారు.ప్రతి ఉపాధ్యాయుడు తమ గ్రామాన్ని మ్యాపింగ్ చేసి ఇంటింటికి వెళ్లి విద్యార్థులను పాఠశాలకు తీసుకురావాలని, అంగన్వాడీ కేంద్రాల్లో బడి ఈడు పిల్లలను నమోదు చేసుకోవాలని నిర్దేశించారు. ప్రభుత్వ గిరిజన పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమ విద్య, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, సన్నబియ్యం భోజనం అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు పవార్ లింబారావ్, ఎస్‌సీఆర్‌పీలు రాథోడ్ రవీందర్, కూడ్మే అనంత్ తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Admin
వాస్తవ గమ్యం