వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : ఆసిఫాబాద్ జిల్లా పవర్ గూడ గ్రామంపంచాయతీ అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని కోరుతూ జైనూర్ మండలంలోని పవర్‌గూడా గ్రామపంచాయతీ సర్పంచ్ తొడసం రాజేందర్ ఆసిఫాబాద్ ఎమ్మెల్యే శ్రీమతి కోవలక్ష్మిని కలిసి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోవలక్ష్మి నివాసంలో సర్పంచ్ తొడసం రాజేందర్ గ్రామస్తులతో కలిసి ఎమ్మెల్యేను కలిశారు. గ్రామంలో పోచమ్మ దేవాలయం నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని, అలాగే *పెరిలా సవరి ల సెటర్ల* కోసం నిధులు కేటాయించాలని కోరారు. అదేవిధంగా గ్రామంలో ప్రజలకు మెరుగైన వెలుతురు సౌకర్యం కల్పించేందుకు హైమాస్ట్ లైట్లు మంజూరు చేయాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.గ్రామ అభివృద్ధికి అవసరమైన సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు సహకరించాలని సర్పంచ్ రాజేందర్ కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తొడసం గంగారాం పటేల్, అనక రాంజీ, కనక భీమ్‌రావ్, ఉక్క శ్రీనివాస్, మాడవి కృష్ణ, తొడసం జంగు తదితరులు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం