Friday, 11 September 2026 02:47:37 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

జైనూర్ మార్కెట్ కమిటీ లో ఘనంగా శ్రీకాంత్ జాదవ్ జన్మదిన వేడుకలు

Date : 10 August 2026 04:29 PM Views : 105

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : వాస్తవ గమ్యం : 10 ఆగస్ట్ కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా : జైనూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ లో సామాజిక సేవకులు, హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ (హెడ్ ) సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీకాంత్ జాదవ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి శ్రీకాంత్ జాదవ్‌కు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.సమాజానికి తనవంతు సేవ చేయాలనే సంకల్పంతో శ్రీకాంత్ జాదవ్ గారు గిరిజన ప్రాంతాల్లో విద్య, వైద్యం, వ్యవసాయం, ఉపాధి రంగాల్లో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని పలువురు కొనియాడారు. మారుమూల గిరిజన గ్రామాల్లో అవసరమైన సమయంలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం, కంటి పరీక్షలు చేయించి అవసరమైన వారికి కంటి అద్దాలు అందించడం, విద్యార్థులకు పోటీ పరీక్షల స్టడీ మెటీరియల్ అందించడం వంటి కార్యక్రమాలు చేపడుతున్నారని పేర్కొన్నారు.అదేవిధంగా రైతులకు వ్యవసాయ నిపుణుల ద్వారా సలహాలు, సూచనలు అందిస్తూ అండగా నిలుస్తున్నారని, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న నిరుపేద కుటుంబాలను తనవంతుగాఆదుకుంటున్నారని తెలిపారు. కరోనా లాక్‌డౌన్ సమయంలో పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందించి మానవత్వాన్ని చాటుకున్నారని గుర్తు చేశారు. వర్షాకాలంలో మారుమూల గ్రామాలకు రాకపోకలు ఇబ్బందికరంగా మారినప్పుడు తన సొంత ఖర్చులతో రహదారి మరమ్మతులు చేయించడం అభినందనీయమన్నారు.మానవ సేవే మాధవ సేవ” అనే భావనతో నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ గిరిజన ప్రాంత ప్రజలకు అండగా నిలుస్తున్న శ్రీకాంత్ జాదవ్ మరింత సేవ చేయాలని పలువురు ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కె. విశ్వనాథ్, మాజీ గ్రంథాలయ చైర్మన్ కనగ యదవ్ అంబాజీ మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, ఆత్రం రాము కొమురం భీం వారసుడు కొమురం జంగు అధికారులు, హెడ్సొ సైటీ సభ్యులు, అభిమానులు, శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొని శ్రీకాంత్ జాదవ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా శ్రీకాంత్ జాదవ్ మాట్లాడుతూ తనపై అభిమానంతో జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులోనూ గిరిజన ప్రాంత ప్రజలకు తనవంతు సేవలను కొనసాగిస్తానని పేర్కొన్నారు.

Kumram jangu

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :