వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : ఆసిఫాబాద్ మండల్ ఈదులవాడ గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న గొల్లగూడ టు కొమ్ముగూడ రహదారిలో అడ్డగా ఉన్న ట్రాన్స్ఫార్మర్. అధికారులకు పలుమార్లు చెప్పినా కానీ పట్టించుకోవడం లేదని గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటునుండి వచ్చి పోయే వాహనదారులకు పెను ప్రమాదంగా మారిందని, సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ప్రాణం పోతే గాని పట్టించుకోరా అని గ్రామ ప్రజలు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రాన్స్ఫార్మర్ రోడ్డుకు అడ్డంగానే కాకుండా కిందికి ఉండడం వల్ల పశువులకు కూడా ప్రమాదకరంగా మారింది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ట్రాన్స్ఫార్మర్ ని వేరే చోటుకు మార్చాలని గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు.
Reporter
వాస్తవ గమ్యం