Sunday, 13 September 2026 08:38:46 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

మందమర్రిలో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

Date : 19 June 2026 05:57 PM Views : 192

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి పట్టణంలోని మనోవికాస్ పాఠశాలలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మంద తిరుమల్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీసీసీ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి హాజరై విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి, వారికి నోట్‌బుక్స్, పెన్నులు, పండ్లు, మిఠాయిలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపిందని పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో కూడా ఆ యాత్ర కీలక పాత్ర పోషించిందన్నారు.అలాగే, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీస్తూ రాష్ట్రాల హక్కులను కాలరాస్తోందని ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీలను అణచివేయడానికి వివిధ సంస్థలను ఉపయోగిస్తూ రాజకీయ కుట్రలకు పాల్పడుతోందని విమర్శించారు.దేశానికి రాహుల్ గాంధీ నాయకత్వం అవసరమని, ఆయన ఆశయాల సాధన కోసం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త శక్తివంచన లేకుండా కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, జిల్లా, పట్టణ కమిటీ సభ్యులు, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, మైనారిటీ, సేవాదళ్, అనుబంధ సంఘాల నాయకులు, సోషల్ మీడియా వారియర్స్, బూత్ ఇన్‌చార్జ్‌లు తదితరులు పాల్గొన్నారు.

BAIRY RAVINDAR

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :