వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : ఆసిఫాబాద్: ఆసిఫాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి అజ్మీరా శ్యామ్ నాయక్ జన్మదినాన్ని పురస్కరించుకొని వాంకిడి మండలంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమా నులు ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా మండలవ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు, పూజలు, భూమి పూజలు చేపట్టి శ్యామ్ నాయక్ గారిపై తమ అభిమానాన్ని చాటుకున్నారు.ఈ సందర్భంగా వాంకిడి మండలంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, *అజ్మీరా శ్యామ్ నాయక్ ప్రజలకు మరింత సేవ చేయాలని, రాబోయే ఎన్నికల్లో విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ నాయకులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం నాలుగు చోట్ల భూమి పూజలు నిర్వహించారు. అలాగే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.అదేవిధంగా బుద్ధ భవనంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు ఒకరికొకరు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వేడుకల్లో పాల్గొన్నారు.నాలుగో షెడ్ నిర్మాణానికి నిధులు సమకూరుస్తానని హామీ.జన్మదిన వేడుకల సందర్భంగా నాలుగో షెడ్ నిర్మాణానికి అవసరమైన నిధులను సమకూర్చేందుకు కృషి చేస్తానని అజ్మీరా శ్యామ్ నాయక్ గారు హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు. ప్రజల అవసరాలను గుర్తించి, స్థానిక అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండటమే తన లక్ష్యమని ఆయన పేర్కొన్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో వాంకిడి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, గ్రామ సర్పంచులు, ఉపసర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు. శ్యామ్ నాయక్ జన్మదిన వేడుకలు మండలంలో పండుగ వాతావరణాన్ని సంతరించు కున్నాయి.
Reporter
వాస్తవ గమ్యం