వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : జైనూర్ మండలంలోని డీసీఎస్ పరిధిలో పంట సర్వే వాలంటీర్లుగా విధులు నిర్వహిస్తున్న తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వాలంటీర్లు వ్యవసాయ శాఖ అధికారులకు వినతిపత్రం సమర్పించారు.ప్రభుత్వం సూచించిన విధంగా గ్రామాల్లో పంటల వివరాల సేకరణ, రైతులకు సంబంధించిన సమాచారాన్ని నమోదు చేయడం వంటి బాధ్యతలను తాము నిర్వహిస్తున్నామని వాలంటీర్లు తెలిపారు.అయితే విధులు నిర్వహిస్తున్న తమకు ఇప్పటివరకు గుర్తింపు కార్డులు, యూనిఫాం/డ్రెస్, సరైన పారితోషికం వంటి సౌకర్యాలు కల్పించలేదని పేర్కొన్నారు.పంట సర్వే సమయంలో గ్రామాల్లో రైతులు, ప్రజలు వాలంటీర్లను గుర్తించేందుకు గుర్తింపు కార్డులు ఎంతో అవసరమని తెలిపారు. గుర్తింపు కార్డులు లేకపోవడంతో పలు ఇబ్బందులు ఎదురవు తున్నాయని, అలాగే విధులకు అనుగుణంగా పారితోషికం చెల్లించాలని కోరారు.ఈ సందర్భంగా అధికారులు తమ సమస్యలను పరిశీలించి పరిష్కరించాలని కోరుతూ ఐదు ప్రధాన డిమాండ్లతో వినతిపత్రం అందజేశారు. వాలంటీర్లకు అధికారిక గుర్తింపు కార్డులు ఇవ్వాలని, పంట సర్వేలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన సౌకర్యాలు కల్పించాలని, పారితోషికం సక్రమంగా చెల్లించాలని, విధుల నిర్వహణకు అవసరమైన పత్రాలు, పరికరాలు అందించాలని వారు కోరారు. కార్యక్రమంలో పంట సర్వే వాలంటీర్లు పాల్గొని తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.అధికారులు సానుకూలంగా స్పందించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని వాలంటీర్లు విజ్ఞప్తి చేశారు.
Reporter
వాస్తవ గమ్యం