వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : కొమరం భీమ్ఆసిఫాబాద్: ఆసిఫాబాద్ ఆర్టీసీ డిపోలో నిర్వహించిన కార్మిక సంఘాల ఎన్నికల్లో ఎంప్లాయిస్ కూటమి ఘన విజయం సాధించింది. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగగా, కూటమి విజయంపై ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉపేందర్ హర్షం వ్యక్తం చేశారు.ఎంప్లాయిస్ కూటమి విజయం సాధించిన సందర్భంగా కూటమి నాయకులు, కార్యకర్తలు టపాకాయలు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, విజయోత్సవాల్లో పాల్గొన్నారు.ఎన్నికల్లో ఎంప్లాయిస్ కూటమి విజయం సాధించడంపై పలువురు కార్మికులు, నాయకులు అభినందనలు తెలిపారు. కార్మికుల మద్దతుతో కూటమి విజయం సాధించడం పట్ల నాయకులు సంతోషం వ్యక్తం చేశారు
Reporter
వాస్తవ గమ్యం