వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : జైపూర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం, దివంగత నేత గడ్డం వెంకటస్వామి కాక జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు . ఈ సందర్భంగా కాక చిత్రపటానికి పూలమాలవేసి, వారు ప్రజల సంక్షేమం కోసం చేసిన సేవలను ప్రజల పట్ల చూపిన అంకిత భావాన్ని స్మరించుకున్నారు. అనంతరం, ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు . ఈ కార్యక్రమానికి మండలంలోని వివిధ శాఖలకు చెందిన మండల స్థాయి అధికారులు హాజరై ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు.ఈ సందర్భంగా మొత్తం (01) ఫిర్యాదు అందగా, వాటిలో *రెవెన్యూ శాఖకు (01)* ఫిర్యాదు వచ్చింది. సంబంధిత శాఖల అధికారులు ఫిర్యాదులను స్వీకరించి, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించడం జరిగింది.ఈ సందర్భంగా ఎంపీడీవో శ్రీపతి బాపు రావు మాట్లాడుతూ, మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని, తమ సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులను ప్రజావాణిలో సమర్పించి పరిష్కారం పొందవచ్చని తెలిపారు.
Reporter
వాస్తవ గమ్యం