Sunday, 13 September 2026 10:51:44 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

గోదాములుగా మారిన రైస్ మిల్లుల స్వాధీనం..

ప్రభుత్వ ఆధీనంలోకి మూడు మిల్లులు

Date : 24 June 2026 09:02 PM Views : 262

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : జూన్ 24: జిల్లాలో స్టేట్ వేర్‌హౌస్ కార్పొరేషన్‌కు గోదాములుగా కేటాయించిన రైస్ మిల్లులను ప్రభుత్వ ఆదేశాల మేరకు స్వాధీనం చేసుకుని సీల్ వేసినట్లు జిల్లా పౌరసరఫరాల అధికారి బ్రహ్మారావు తెలిపారు. హాజీపూర్ మండల పరిధిలో ఉన్న రాజరాజేశ్వర మిల్ గోదాము, జయలక్ష్మి మిల్, సాయి మణికంఠ మిల్‌లను అధికార యంత్రాంగం బుధవారం స్వాధీనం చేసుకుంది.ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా చేపట్టిన ఈ చర్యలో మండల తహసీల్దార్ పుష్పలత, పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ శ్రీకళ, స్టేట్ వేర్‌హౌస్ కార్పొరేషన్ సిబ్బంది, రెవెన్యూ శాఖ అధికారులు పాల్గొన్నారు. సంబంధిత మిల్లులను ముందస్తుగా అధికారికంగా స్వాధీనం చేసుకుని తాళాలు వేసి సీల్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.జిల్లాలో ప్రభుత్వ అవసరాల కోసం కేటాయించిన గోదాముల నిర్వహణ, నిల్వల భద్రత, పరిపాలనా నియంత్రణను మరింత పటిష్టం చేయాలనే ఉద్దేశంతో ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు. స్వాధీనం ప్రక్రియను నిబంధనలకు అనుగుణంగా పూర్తి చేసి, సంబంధిత రికార్డులను సిద్ధం చేసినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో స్టేట్ వేర్‌హౌస్ కార్పొరేషన్, పౌరసరఫరాల శాఖ, రెవెన్యూ శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

BEERAM SHARATH CHANDHRA

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :