వాస్తవ గమ్యం / తెలంగాణ / జగిత్యాల్ : ఎండపల్లి మండల బీఆర్‌ఎస్ అధ్యక్షుడు సింహాచలం జగన్ కుటుంబానికి పార్టీ తరఫున రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించారు. ఇటీవల ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో జగన్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావును కలిసి జగన్ కుటుంబ పరిస్థితులను వివరించి ఆర్థిక సాయం అందించాలని కోరారు.దీనిపై కేటీఆర్ వెంటనే స్పందించి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కార్యకర్తలు ఆత్మహత్యలకు పాల్పడవద్దని ఆయన సూచించినట్లు నాయకులు తెలిపారు. సింహాచలం జగన్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన కేటీఆర్.కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో పాటు మండల నాయకులు ఏలేటి కృష్ణారెడ్డి, గాజుల మల్లేశం, మారం జలందర్ రెడ్డి, కల్వల గంగాధర్ రావు, ముత్యం బలరాంరెడ్డి, రాంచందర్ గౌడ్, మాధవరావు, సందీప్, కల్వల తేజ, దూస గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం