వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : శ్రీ శ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి 70వ తిరునక్షత్ర మహోత్సవాల సందర్భంగా మంచిర్యాల జిల్లా మందమర్రి యాపల్ ప్రాంతంలోని శ్రీ కోదండ రామాలయం ఆధ్వర్యంలో శుక్రవారం శ్రీరామ హృదయ కలశం ఊరేగింపును భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.శ్రీ కోదండ రామాలయం నుంచి ప్రారంభమైన ఈ ఊరేగింపు పురవీధుల గుండా శివాలయం వరకు సాగింది. కార్యక్రమాన్ని ఆకుదారి లక్ష్మణ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఊరేగింపులో భాగంగా ప్రతి ఇంటి నుంచి భక్తులు తమ ఇళ్లలోని బియ్యాన్ని శ్రీరామ హృదయ కలశంలో సమర్పించి స్వామివారిపై తమ భక్తి, విశ్వాసాన్ని చాటుకున్నారు.ఈ కార్యక్రమంలో పైడిమల్ల అరుణ్, కుప్పాల శ్రీనివాస్, హనుమాన్ భక్తులు, శ్రీ కోదండ రామాలయం కమిటీ సభ్యులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Reporter
వాస్తవ గమ్యం