Saturday, 12 September 2026 09:05:33 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

అర్ధరాత్రి ఆదివాసి ఇల్లు దహనం.. రూ.2.77 లక్షల నగదు బూడిద

కారకులపై చర్యలు తీసుకోకుంటే ఇల్లు ముట్టడిస్తాం హెచ్చరిక

Date : 17 May 2026 07:12 PM Views : 335

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : కోటపల్లి (మే 17): అర్ధరాత్రి వేళ ఆదివాసీల ఇండ్లు కాలిపోవడానికి కారకులైన పెత్తందార్లపై తక్షణమే చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి ఎర్మ పున్నం డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం సిర్స గ్రామంలో ప్రమాద స్థలాన్ని ఆదివారం ఆయన పరిశీలించి, బాధితులను పరామర్శించారు.మహారాష్ట్ర నుండి వలస వచ్చి ఇక్కడ వ్యవసాయ పాలేరుగా జీవిస్తున్న సిడం లచ్చన్న, సిడం రాకేష్‌ల అద్దె ఇల్లు మే 5న జరిగిన అగ్నిప్రమాదంలో పూర్తిగా కాలిపోయింది. గ్రామానికి చెందిన బీరం భాస్కర్ రెడ్డి తన పెరట్లోని చెత్తను కాల్చి, నిప్పులు ఆర్పకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని, బాధితులు కట్టుబట్టలతో ప్రాణాలతో బయటపడ్డారని పున్నం తెలిపారు. ఈ ప్రమాదంలో రూ. 2.77 లక్షల నగదు, 10 తులాల వెండి బూడిదయ్యాయన్నారు.బాధితులను ఆదుకోవాల్సింది పోయి యజమాని శెనిగరపు మల్లారెడ్డి మానసికంగా హింసించడం దుర్మార్గమని, ఘటన జరిగి 10 రోజులు దాటినా మంత్రి వివేక్, పోలీసులు స్పందించకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. అధికారులు స్పందించి బాధితులకు నష్టపరిహారం అందించి, న్యాయం చేయాలని, లేనిపక్షంలో బీరం భాస్కర్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు తలండి ముత్తయ్య, ఆత్రం సంపత్, కోర్తే సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: