Saturday, 12 September 2026 09:02:31 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

మందమర్రి సింగరేణి హైస్కూల్‌లో ఘనంగా యాంటీ డ్రగ్స్ అవగాహన సదస్సు

Date : 25 June 2026 06:04 PM Views : 585

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి, జూన్ 25: అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని మందమర్రి పట్టణంలోని సింగరేణి కాలరీస్ ఎయిడెడ్ హైస్కూల్ (కళ్యాణిఖని)లో గురువారం 'ఈగల్ ఫోర్స్ తెలంగాణ' పోలీస్ శాఖ ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్స్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్, మందమర్రి సీఐ రమేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఏసీపీ కిరణ్ కుమార్ మాట్లాడుతూ, యువత డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండి చదువుపై దృష్టి సారించాలని సూచించారు. విద్యార్థి దశలోనే లక్ష్యాలను నిర్దేశించుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని, తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్ సరఫరా లేదా వినియోగంపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు లేదా యాంటీ డ్రగ్ హెల్ప్‌లైన్ 1908కు తెలియజేయాలని కోరారు.కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, పోలీస్ సిబ్బందితో కలిసి అధికారులు డ్రగ్స్ వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించారు. అలాగే మాదకద్రవ్యాల దుష్ప్రభావాలను వివరించే అవగాహన పోస్టర్లను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో ఎస్ఐ నరేష్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పోలీస్ సిబ్బంది, అలాగే సింగరేణి, కార్మల్, లిటిల్ ఫ్లవర్, శ్రీచైతన్య, కృష్ణవేణి, మాంటెస్సోరి పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.

BAIRY RAVINDAR

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :