Friday, 11 September 2026 02:47:40 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఏఐటీయూసీ అండగా ఉంటుంది: వాసిరెడ్డి సీతారామయ్య

Date : 03 August 2026 03:51 PM Views : 66

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి లో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య ముఖ్య అతిథిగా పాల్గొని జీఎం కార్యాలయ ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు. సింగరేణి సంస్థ ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితులను వివరిస్తూ, మణుగూరు ఓసీ బ్లాక్‌ను జెన్‌కోకు కాకుండా సింగరేణికే కేటాయించాలని ప్రభుత్వం వద్ద ఏఐటీయూసీ బలంగా డిమాండ్ చేస్తోందని తెలిపారు.ఈ వారంలో డైరెక్టర్‌తో జరగనున్న సమావేశాల్లో సానుకూల నిర్ణయం రాకపోతే ఆగస్టులో చేపట్టే సమ్మెకు ఉద్యోగులు పూర్తి సహకారం అందించాలని ఆయన పిలుపునిచ్చారు.ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి ఏఐటీయూసీ కట్టుబడి ఉందని పేర్కొన్న ఆయన, పెండింగ్‌లో ఉన్న జూనియర్ అసిస్టెంట్ పరీక్షలను త్వరగా నిర్వహించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే క్లరికల్ రిక్రూట్‌మెంట్ పూర్తై కొత్త నియామకాలు జరిగిన అనంతరం బదిలీ అయిన ఉద్యోగులను వీలైనంతవరకు తిరిగి యథాస్థానాలకు తీసుకురావడానికి ప్రయత్నిస్తామని తెలిపారు.ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు ఏఐటీయూసీ లో చేరారు. పర్చేజ్ విభాగానికి చెందిన సీనియర్ అసిస్టెంట్ జంగిలి అనూష, జనరల్ అసిస్టెంట్లు సిధామళ్ల రఘు, కుదిరే సువర్ణ, చిలుక దేవమ్మ, బరిగెల లక్ష్మి, ఏనుగు వినోద, భాగ్యలక్ష్మితో పాటు మరికొందరు సంఘంలో సభ్యత్వం స్వీకరించారు.కార్యక్రమంలో సెంట్రల్ సెక్రటరీ అక్బర్ అలీ, ఏరియా వైస్ ప్రెసిడెంట్ సుదర్శన్, స్ట్రక్చర్ కమిటీ సభ్యుడు సి.వి. రమణ, పిట్ సెక్రటరీ సృజన గీతిక, పిట్ కమిటీ సభ్యులు బొమ్మ శ్రీనివాస్, లక్ష్మణ్, బింగి సత్యనారాయణ, తోకల జ్యోతి, జలధి సుమలత, లక్కాకుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

BAIRY RAVINDAR

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :