వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మధ్యాహ్న భోజన కార్మికులకు నెలకు రూ.10 వేల వేతనం చెల్లించాలని, పెండింగ్లో ఉన్న జీతాలు, బిల్లులను వెంటనే విడుదల చేయాలని మంచిర్యాల సీఐటీయూ జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు. తెలంగాణ మధ్యాహ్న భోజన కార్మిక సంఘం ఆధ్వర్యంలో జిల్లా ఉపాధ్యక్షురాలు కామ్రేడ్ మధునమ్మ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రూ.10 వేల వేతనం అమలు చేయాలని కోరారు. మధ్యాహ్న భోజన పథకాన్ని స్వచ్ఛంద సంస్థలకు అప్పగించే నిర్ణయాన్ని వ్యతిరేకించారు. గత 20 ఏళ్లుగా కార్మికుల సమస్యలు పరిష్కారం కాలేదని జిల్లా కార్యదర్శి ఎం.డి. రఫీయా పేర్కొన్నారు. సమస్యల పరిష్కారం కోసం అక్టోబర్ 12న జిల్లా కలెక్టరేట్ ఎదుట నిర్వహించే ధర్నాకు కార్మికులు పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా కోశాధికారి సవిత, నాయకులు వెంకటలక్ష్మి, భాగ్య తదితరులు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం