వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : కొమురం భీం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహాలను తరలించేందుకు కూడా అంబులెన్స్ అందుబాటులో లేకపోవడం బాధాకరమని బహుజన్ ముక్తి పార్టీ జిల్లా అధ్యక్షుడు భూక్య రాజు విమర్శించారు. పేద ప్రజలకు అవసరమైన వైద్య సేవలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా ఆసుపత్రిలో అంబులెన్స్‌తో పాటు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. ఆసుపత్రి సేవల పర్యవేక్షణలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.
Admin
వాస్తవ గమ్యం