వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా: జిల్లా కేంద్రంలోని అంకుషాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో మంగళవారం మధ్యాహ్నం సుమారు 12 గంటల సమయంలో అంగన్వాడీ కేంద్రం భవనం పైకప్పు పెచ్చులు ఒక్కసారిగా కూలిపోవడంతో చిన్నారులు, పెద్దలు గాయపడిన ఘటన చోటుచేసుకుంది.ఈ ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు, ఇద్దరు మహిళలు గాయపడినట్లు సమాచారం. గాయపడిన వారిని వెంటనే ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో బామ్ని సోనీ (35), పడోరే సంగీత (40), కార్తిక, సాత్విక (4), హారిక (5), సాయినాథ్ కవల్కర్ (5) ఉన్నట్లు స్థానికులు తెలిపారు. భవనం పైకప్పు పెచ్చులు పడటంతో కొందరికి తలకు, చిన్నారులకు కాళ్లకు గాయాలైనట్లు సమాచారం. ముందే హెచ్చరించినా పట్టించుకోలేదని ఆరోపణ అంగన్వాడీ భవనం పైకప్పు గతంలోనే శిథిలావస్థకు చేరిందని, పెచ్చులు ఊడిపడే పరిస్థితి ఉందని తల్లిదండ్రులు, స్థానికులు పలుమార్లు అంగన్వాడీ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. అయితే సమస్యను అధికారులు సీరియస్‌గా తీసుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. “భవనం పైకప్పు పెచ్చులు ఊడిపోతున్నాయి.. పిల్లలకు ప్రమాదం జరిగే అవకాశం ఉంది” అని గతంలోనే తల్లిదండ్రులు ప్రశ్నించినప్పటికీ తగిన చర్యలు తీసుకోలేదని వారు పేర్కొన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలిఅంగన్వాడీ భవనం పరిస్థితిపై ముందుగానే సమాచారం ఉన్నప్పటికీ మరమ్మతులు చేపట్టకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్నారుల ప్రాణాలకు ముప్పు కలిగించేలా ఉన్న శిథిల భవనాల్లో అంగన్వాడీ కేంద్రాలను నిర్వహించకుండా, వెంటనే సురక్షితమైన భవనానికి తరలించాలని కోరుతున్నారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులు సమగ్ర విచారణ చేపట్టి, నిర్లక్ష్యానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే అంకుషాపూర్‌లోని అంగన్వాడీ భవనం పరిస్థితిని వెంటనే పరిశీలించి, భవనం సురక్షితంగా ఉందో లేదో అధికారులు నిర్ధారించాలని కోరుతున్నారు.
గాయపడిన చిన్నారులను పరామర్శించిన డీసీసీ అధ్యక్షురాలు, కలెక్టర్ అంకుషాపూర్ అంగన్వాడీ కేంద్రంలో పైకప్పు పెచ్చులు కూలి గాయపడిన చిన్నారులు, మహిళలను డీసీసీ అధ్యక్షురాలు సుగుణ గారు, జిల్లా కలెక్టర్ హరిత గారు పరామర్శించారు. ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి బాధితుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఘటనకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకుని, బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.
Reporter
వాస్తవ గమ్యం