వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : సింగరేణి సంస్థకు చెందిన క్వార్టర్‌ను అనధికారికంగా ఆక్రమించి నివాసముంటున్నారన్న ఫిర్యాదుల నేపథ్యంలో విజిలెన్స్ విచారణ నిర్వహించి,సంస్థ నిబంధనల ప్రకారమే క్వార్టర్‌ను ఖాళీ చేయించామని మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) ఎన్. రాధాకృష్ణ స్పష్టం చేశారు. క్వార్టర్ ఖాళీ చేయింపు వ్యవహారంతో మంత్రికి ఎలాంటి సంబంధం లేదని తెలిపారు.ఈ మేరకు గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జీఎం రాధాకృష్ణ వివరాలను వెల్లడించారు. సింగరేణికి చెందిన B-40 క్వార్టర్‌లో మద్దె శంకర్ అనధికారికంగా నివాసముంటున్నట్లు విజిలెన్స్ విచారణలో నిర్ధారణ అయిందని తెలిపారు.గతంలో అందిన ఫిర్యాదుల ఆధారంగా విజిలెన్స్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించి నివేదిక సమర్పించారని పేర్కొన్నారు.మంత్రికి సంబంధం లేదుమంత్రి క్యాంపు కార్యాలయం కోసం గతంలో సంస్థ నిబంధనల ప్రకారం B-1 క్వార్టర్‌ను అధికారికంగా కేటాయించామని జీఎం తెలిపారు. సంస్థ నిబంధనల ప్రకారం ఒక వ్యక్తికి ఒకే క్వార్టర్ కేటాయింపు ఉంటుందని, B-40 క్వార్టర్‌ను ఎవరికీ అధికారికంగా కేటాయించలేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో B-40 క్వార్టర్ ఖాళీ చేయింపు వ్యవహారంలో మంత్రికి ఎలాంటి సంబంధం లేదన్నారు. రాజకీయ కారణాలతో మంత్రిపై ఆరోపణలు చేయడం సరికాదని పేర్కొన్నారు.మూడు పర్యాయాలు నోటీసులుక్వార్టర్ ఖాళీ చేయాలని సదరు వ్యక్తికి పలుమార్లు కౌన్సెలింగ్ ఇచ్చినట్లు జీఎం తెలిపారు.అయినప్పటికీ ఖాళీ చేయక పోవడంతో జూన్, జూలై, ఆగస్టు నెలల్లో మూడు పర్యాయాలు రాతపూర్వక నోటీసులు జారీ చేశామని చెప్పారు.ఎవిక్షన్ ప్రక్రియలో భాగంగా ఫారం-A, ఫారం-B నోటీసులు అందించి నప్పటికీ క్వార్టర్ ఖాళీ చేయకపోవడంతో,నిబంధనల ప్రకారం పోలీసుల సమక్షంలో ఎస్టేట్,సెక్యూరిటీ సిబ్బంది సహకారంతో క్వార్టర్‌ను ఖాళీ చేయించినట్లు వివరించారు.సామాగ్రి భద్రంగా భద్రపరిచాంక్వార్టర్‌లో ఉన్న సామాగ్రిని భద్రంగా తరలించి భద్రపరిచామని జీఎం తెలిపారు. సదరు వ్యక్తి వచ్చి తన వస్తువులను తీసుకెళ్లవచ్చని చెప్పారు.సింగరేణి సంస్థ ఆస్తులను పరిరక్షించడంలో భాగంగానే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకున్నామని, ఇందులో ఎలాంటి వ్యక్తిగత కక్ష సాధింపు లేదని రాధాకృష్ణ స్పష్టం చేశారు.
Reporter
వాస్తవ గమ్యం