వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : వాంకిడి: కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో భారతీయ జనతా యువమోర్చా (బీజేవైఎం) జిల్లా కమిటీలో వాంకిడి మండలానికి చెందిన మండోకర్ వికాస్‌కు చోటు దక్కింది. ఆయనను బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమించారు.మండోకర్ వికాస్ గతంలో బీజేవైఎం వాంకిడి మండల అధ్యక్షుడిగా పనిచేశారు. పార్టీ కోసం ఆయన చేసిన సేవలను గుర్తించిన అధిష్ఠానం జిల్లా కమిటీలో కీలక బాధ్యతలు అప్పగించింది.ఈ సందర్భంగా మండోకర్ వికాస్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో జిల్లా ఉపాధ్యక్ష పదవి అప్పగించిన భారతీయ జనతా పార్టీ కొమరం భీం జిల్లా అధ్యక్షులు ధోని శ్రీశైలం కి, భారతీయ జనతా యువమోర్చా జిల్లా అధ్యక్షులు ఎలగతి సుచిత్ కీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పార్టీ అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ యువతను పార్టీ వైపు ఆకర్షించేందుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు.
Reporter
వాస్తవ గమ్యం