Sunday, 13 September 2026 07:34:23 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలు. జిల్లా ఎస్పీ

ముందస్తు అనుమతి లేకుండా ప్రజా బహిరంగ కార్యక్రమాలు, సభలు, ర్యాలీలు నిషేధం

Date : 01 May 2026 07:23 PM Views : 127

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : మే 01 వ తేదీ నుంచి మే 31 వ తేది వరకు జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ నిబంధనలు వర్తిస్తాయి, ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు: జిల్లా ఎస్పీ నితిక పంత్ కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా శాంతిభద్రతల దృష్ట్యా, ప్రశాంత వాతావరణ పరిస్థితులను మరింత సవ్యంగా కొనసాగించడానికి మే 01 వ తేదీ నుండి మే 30 వ తేది వరకు జిల్లా అంతటా 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ నితిక పంత్ ఐపీఎస్ బుధవారం ఒక ప్రకటన లో తెలిపారు. 30 పోలీస్ యాక్ట్-1861 అమల్లో ఉన్నందున జిల్లాలో డిఎస్పి/ఎఎస్పీ లేదా ఆపై పోలీస్ ఉన్నతాధికారుల నుండి ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, బహిరంగ సభలు, తదితర ప్రజలు గుమికూడి ఉండేవిధంగా కార్యక్రమాలు నిర్వహించడానికి సన్నాహాలు చేయరాదని తెలిపారు. నిషేధిత ఆయుధాలు, దురుద్దేశంతో నేరాలకు ఉసి కోలిపే ఎటువంటి ఆయుధాలు కల్గిఉండరాదని తెలిపారు. ప్రజా జనజీవనానికి ఇబ్బంది, చిరాకు కల్గించేందుకు దారితీసే ఇబ్బందికర ప్రజా సమావేశాలు, జన సమూహం అలాంటివి పూర్తిగా నిషేధం అన్నారు. చట్టపరమైన జారీచేసిన ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘిస్తే 30 పోలీస్ యాక్ట్ 1861 ప్రకారం శిక్షార్హులు అవుతారని సూచించారు. నిషేధంలో ఉన్న నిబంధనలను తప్పనిసరిగా అందరూ పాటించాలన్నారు. ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలన్న ముందస్తుగా దరఖాస్తు చేసుకొని అనుమతులు తీసుకోవాలని సూచించారు. 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నందున ఎటువంటి అనుమతులు లేని ర్యాలీలు నిర్వహించిన వారిపై కఠినమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

V SAMYUKTHA

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: