Saturday, 12 September 2026 09:03:17 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

కమిషన్ల కోసమే కాళేశ్వరం తరలింపు: మంత్రి వివేక్

Date : 06 July 2026 11:11 AM Views : 243

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల: కమిషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టును తుమ్మిడిహెట్టి నుంచి కాళేశ్వరానికి తరలించారని రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి తీవ్ర ఆరోపణలు చేశారు. మంచిర్యాల జిల్లా కేతనపల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేసినప్పటికీ, రైతులకు వాస్తవంగా ఎన్ని టీఎంసీల సాగునీరు అందించారో ప్రజలకు చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. ప్రజల ప్రయోజనాల కంటే కమిషన్లకే ప్రాధాన్యం ఇచ్చి ప్రాజెక్టు రూపురేఖలు మార్చారని విమర్శించారు.కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ ప్రభావంతో చెన్నూర్ మండలంలోని అనేక గ్రామాల రైతులు తీవ్రంగా నష్టపోయారని, వారి వ్యవసాయ భూములు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. బాధిత రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.40 కోట్ల నష్టపరిహారం అందించి అండగా నిలిచిందని తెలిపారు. గత ప్రభుత్వ విధానాల కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమం, పారదర్శక పాలనకు ప్రాధాన్యం ఇస్తూ సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తోందని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు.

BEERAM SHARATH CHANDHRA

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :