వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : రెబ్బెన (ఆసిఫాబాద్):విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం మూలంగా పంటలకు నీరందక అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం నారాయణపూర్ నుండి పైకాజిగూడకు వెళ్లే త్రీఫేస్ (3-Phase) విద్యుత్ లైన్ దెబ్బతిని చాలా రోజులు గడుస్తున్నా, అధికారులు పట్టించుకోవడం లేదని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.నామమాత్రపు పనులతో మభ్యపెడుతున్న అధికారులు.ప్రస్తుతం పంటలకు నీరు అందించాల్సిన కీలక సమయం కావడంతో, కరెంట్ సరఫరా లేక బోర్లు, మోటార్లు పనిచేయడం లేదు. విద్యుత్ లైన్ మరమ్మతులపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా, ఫోన్లు చేసినా సరైన స్పందన లభించడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. క్షేత్రస్థాయికి వచ్చి సమస్యను పరిష్కరించకుండా, కేవలం నామమాత్రపు పనులు చేసి చేతులు దులుపుకుంటున్నారని వాపోతున్నారు. పెట్టుబడులు మునిగిపోతాయని ఆందోళన సమయానికి నీరందక పంటలు ఎండిపోయే ప్రమాదం పొంచి ఉందని, దీనివల్ల తాము లక్షల రూపాయల పెట్టుబడి నష్టపోతామని రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.ఇప్పటికైనా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, నారాయణపూర్ – పైకాజిగూడ త్రీఫేస్ విద్యుత్ లైన్‌కు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి సక్రమంగా కరెంట్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
Admin
వాస్తవ గమ్యం