Sunday, 13 September 2026 07:33:20 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

ఫీజు రీయంబర్స్ మెంట్ నిధులు విడుదల చేయాలి

కలెక్టరేట్ వద్ద భారత రాష్ట్ర విద్యార్థి విభాగం వినతి పాత్రం

Date : 27 April 2026 01:47 PM Views : 215

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : రాష్ట్రంలో గత రెండేళ్లుగా నిలిచిపోయిన విద్యార్థుల ఫీజు రీయంబర్స్ మెంట్ నిధులను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భారత రాష్ట్ర విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు.మాజీ ఎంపీ, మాజీ ప్రభుత్వ విప్ మరియు బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బాల్క సుమన్, అలాగే భారత రాష్ట్ర విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భారత రాష్ట్ర విద్యార్థి విభాగం కలెక్టరేట్ ఏ ఓ ని కలిసి వినతి పత్రం అందజేశారు.గత రెండు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు.నిధులు రాకపోవడం వల్ల వేలమంది పేద విద్యార్థులు ఉన్నత చదువులకు ఇబ్బంది పడుతున్నారని, కాలేజీ యాజమాన్యాలు ఒత్తిడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిధులు విడుదల చేయాలని, లేనిపక్షంలో నిరసనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి భారత రాష్ట్ర విద్యార్థి విభాగం, కార్యకర్తలు మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :