Sunday, 13 September 2026 07:54:52 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

ఈ నెల 31లోగా ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలి

జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి రాములు

Date : 17 July 2026 07:34 PM Views : 61

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : జాతీయ ఆహార భద్రతా చట్టం పరిధిలోని జిల్లాలోని రేషన్ కార్డు లబ్ధిదారులందరూ ఈ నెల 31వ తేదీలోగా తప్పనిసరిగా ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి. రాములు సూచించారు.శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని అదనపు కలెక్టర్ చాంబర్‌లో పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ శ్రీకళతో కలిసి మండల రేషన్ షాప్ డీలర్ల సంఘం ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.రేషన్ కార్డుల్లో నమోదైన లబ్ధిదారుల వివరాల పారదర్శకతను నిర్ధారించడం, నకిలీ లబ్ధిదారులను గుర్తించి తొలగించడం, అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ రాయితీ ప్రయోజనాలు నిరంతరాయంగా అందేలా చేయడం కోసం ప్రభుత్వం ఈ-కేవైసీని తప్పనిసరి చేసిందని తెలిపారు.జిల్లాలో ఇంకా గణనీయమైన సంఖ్యలో లబ్ధిదారులు ఈ-కేవైసీ పూర్తి చేయలేదని పేర్కొంటూ, మండల స్థాయిలో ప్రత్యేక కార్యాచరణ చేపట్టి జిల్లాలో 100 శాతం ఈ-కేవైసీ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రేషన్ కార్డులో నమోదైన ప్రతి కుటుంబ సభ్యుడు స్వయంగా సంబంధిత లేదా సమీపంలోని ఏదైనా రేషన్ దుకాణానికి వెళ్లి ఈ-పోస్ యంత్రం ద్వారా వేలిముద్రలు నమోదు చేసి ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలని సూచించారు.గడువులోపు ఈ-కేవైసీ పూర్తి చేయని లబ్ధిదారులు భవిష్యత్తులో రేషన్ పంపిణీ సమయంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్నందున, జిల్లాలోని రేషన్ కార్డు దారులందరూ వెంటనే ఈ-కేవైసీ పూర్తి చేసి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలను నిరంతరాయంగా పొందాలని జిల్లా అదనపు కలెక్టర్ వి. రాములు కోరారు.ఈ సమావేశంలో పౌర సరఫరాల శాఖ అధికారులు, మండల రేషన్ షాప్ డీలర్ల సంఘం ప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

KAGITHAPU SRINIVAS

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :