వాస్తవ గమ్యం / తెలంగాణ / జగిత్యాల్ : విశ్వకర్మ జయంతిని పురస్కరించుకొని ధర్మారం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో నిర్వహించిన విశ్వకర్మ జయంతి ఉత్సవాల్లో గురువారం రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి విశ్వకర్మలకు మంత్రి లక్ష్మణ్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వం తరఫున విశ్వకర్మలకు అన్ని విధాల సహకరిస్తామని మంత్రి లక్ష్మణ్ కుమార్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో విశ్వకర్మ సంఘం ధర్మారం మండల అధ్యక్షుడు వెంకటేష్, ధర్మారం గ్రామ శాఖ అధ్యక్షులు శ్యాంసుందర్ తో పాటు ధర్మారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రూప్ల నాయక్, మండలంలోని పలువురు సర్పంచులతో పాటు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Admin
వాస్తవ గమ్యం