వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల, జూలై 7: మంచిర్యాల ఆర్టీసీ డిపో కార్గో సెంటర్లో చాలా కాలంగా నిల్వ ఉండి వినియోగదారులు తీసుకెళ్లని వివిధ రకాల సామగ్రిని బహిరంగ వేలం ద్వారా విక్రయించనున్నట్లు డిపో మేనేజర్ నరేశ్ కుమార్ తెలిపారు. ఈ నెల 9, 10, 13 తేదీల్లో ఉదయం 11 గంటలకు కార్గో కార్యాలయం ప్రాంగణంలో వేలం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.వేలంలో పాత స్టేషనరీ సామగ్రి, వాహనాల స్పేర్ పార్ట్స్, సినిమా పోస్టర్లు, పుస్తకాలు, ఇతర విడిభాగాలు సహా పలు రకాల వస్తువులు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ఆసక్తి గల వ్యక్తులు, వ్యాపారులు నిర్ణీత తేదీల్లో కార్గో కార్యాలయానికి హాజరై వేలంలో పాల్గొని సామగ్రిని సొంతం చేసుకోవచ్చన్నారు. వేలానికి సంబంధించిన పూర్తి వివరాల కోసం మంచిర్యాల ఆర్టీసీ కార్గో కార్యాలయంలో సంప్రదించాలని డిపో మేనేజర్ సూచించారు.
Reporter
వాస్తవ గమ్యం