వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : తెలంగాణ వీరవనిత, రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలను లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని పాత బస్టాండ్ వద్ద ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.చెల్లా నాగభూషణం, మాజీ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ఎండీ ఆరిఫ్ మాట్లాడుతూ.. పెత్తందారులు, నాటి నిరంకుశ రజాకార్లు, దేశ్‌ముఖ్‌లకు వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ మొక్కవోని ధైర్యంతో పోరాడారని అన్నారు. ఆమె పోరాటం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి స్ఫూర్తినిచ్చిందని పేర్కొన్నారు.మహిళా చైతన్యానికి, ఆత్మగౌరవానికి ఐలమ్మ ప్రతీక అని, ఆమె త్యాగం, పోరాట స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. పేదలు, బలహీన వర్గాలు, బాధితులకు అండగా నిలిచి ప్రజాసేవ చేయడమే ఐలమ్మకు అందించే నిజమైన నివాళి అని అన్నారు.కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ దొంత అంజలి నరసయ్య, వైస్ చైర్మన్ రాజేశ్వరి వెంకటస్వామి గౌడ్, కౌన్సిలర్లు తోట సువర్ణ రమేష్, గోప సుజాత రమేష్, పెండం పద్మ రాజు, సూరం చంద్రమౌళి, శనిగరపు చిన్నయ్య, రజక సంఘం సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం