వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని. టీ డబ్ల్యూ,మోడల్ స్పోర్ట్స్ స్కూల్ (గర్ల్స్) - ఆసిఫాబాద్ వేదికగా _12వ తెలంగాణ స్టేట్ సబ్-జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ - 2026_ ఘనంగా ప్రారంభమైంది.ఈ ఛాంపియన్ షిప్ ను ,ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ గోడం నాగేష్ , ఆసిఫాబాద్ శాసన సభ్యురాలు శ్రీమతి కోవ లక్ష్మీ , జిల్లా కలెక్టర్ , జిల్లా ఎస్పీ , ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ, గౌరవ కేసీఆర్ ఏర్పాటు చేసిన మన ఆసిఫాబాద్ జిల్లా ఏర్పడి దశాబ్ది పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఇలాంటి రాష్ట్ర స్థాయి పోటీలు జరగడం సంతోషంగా ఉందని, క్రీడాకారులకు తన పూర్తి మద్దతు ఉంటుందని అన్నారు.గిరిజన ప్రాంతమైన ఆసిఫాబాద్ లో ఇలాంటి రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలు జరగడం వల్ల ఇక్కడి క్రీడాకారులకు ఎంతో ప్రోత్సాహం లభిస్తుందని అన్నారు. రాష్ట్రం నలుమూలల నుండి వందలాది మంది సబ్-జూనియర్ అథ్లెట్లు ఈ పోటీల్లో పాల్గొంటున్నారని, విజేతలకు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు లభిస్తుందని జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ తెలిపింది.ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడాధికారులు, అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రతినిధులు, కోచ్ లు, క్రీడాకారులు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం