Tuesday, 27 October 2026 05:30:12 PM
# రాజంపేట అభివృద్ధికి ప్రత్యేక నిధులు,సిబ్బందిని కేటాయించాలి # కలెక్టరేట్‌లో ఘనంగా మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు # గుండి బ్రిడ్జిసమస్య పరిష్కారం కోసం యువత సైకిల్ యాత్ర ప్రారంభం # గుండి బ్రిడ్జి సాధనకై యువత సైకిల్ యాత్ర 20 ఏళ్ల సమస్య పరిష్కారమే లక్ష్యం # ఈ నెల 26న జిల్లాలో విద్యాసంస్థలకు స్థానిక సెలవు రెసిడెన్షియల్ పాఠశాలలకు మినహాయింపు # ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను బేషరతుగా రద్దు చేయాలి # జాఫర్‌నగర్ డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి # సెంట్రల్ లైబ్రరీలో కొమురం భీం జయంతి వేడుకలు # మంచిర్యాలలో శాంతిభద్రతలను పరిరక్షించాలి # రాళ్లవాగు బ్రిడ్జి పనులతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేయాలి # విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు జిల్లా పోలీస్ యంత్రాంగం ఘన నివాళి # రావణ దహనానికి పటిష్ఠ పోలీసు బందోబస్తు # కిష్టంపేట గ్రామంలో భక్తిశ్రద్ధలతో మహా చండీ హోమం నిర్వహణ # ప్రమాదవశాత్తు బావిలో పడిన యువ రైతు మృతి. # భీమారం శ్రీ సాయి యూత్ దుర్గా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో చండీ హోమం # సద్దుల బతుకమ్మ సంబరాల్లో విషాదం.. యువతి మృతి # రామలీల కార్యక్రమానికి మంత్రి వివేక్‌కు ఆహ్వానం # ఆదిల్పేట్‌లో ఘనంగా బాల్క సుమన్ పుట్టినరోజు వేడుకలు # గిరిజన పోరాట యోధుల జయంతి ఉత్సవాలకు ఆహ్వానం # ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో రోడ్లు, డ్రైనేజీ పనుల పరిశీలన

మందమర్రి గాయత్రి బ్యాంక్ ఖాతాదారునికి రూ. 2 లక్షల ప్రమాద బీమా అందజేత

Date : 16 September 2026 02:11 PM Views : 411

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : ​మందమర్రి: గాయత్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ మందమర్రి శాఖ ఖాతాదారురాలు దివంగత మొయ్య లావణ్య కుటుంబానికి ‘గాయత్రి నిర్భయ సేవింగ్స్ ఖాతా’ ప్రమాద బీమా కింద రూ.2 లక్షల చెక్కును అందించారు.ఈ చెక్కును స్థానిక ఎస్సై జి. నగేష్ చేతుల మీదుగా లావణ్య భర్త మొయ్య రాంబాబుకు అందజేశారు.ఈ కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ ఎమ్.సతీష్, జూనియర్ ఆఫీసర్ జె.సతీష్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా బ్యాంక్ అందిస్తున్న పలు సేవలు,రుణ సదుపాయాలను మేనేజర్ వివరించారు.రైతులకు సంవత్సరానికి 10.50% వడ్డీతో వ్యవసాయ రుణాలు అందిస్తున్నారు.తక్కువ వడ్డీతో,గ్రాముకు గరిష్టంగా రూ. 8,600 వరకు రుణాలు మంజూరు చేస్తున్నారు.కిసాన్ వికాస్ పత్రాలు, పోస్టాఫీస్ డిపాజిట్లపై నెలకు కేవలం 0.83 పైసల వడ్డీతో ఏడాదికి 10% వడ్డీ రేటు రుణాలు లభిస్తాయి.నూతన సేవింగ్ ఖాతా తెరిచే వారికి అవసరమైన ఫోటోలు, జిరాక్స్ కాపీలను బ్యాంకులోనే ఉచితంగా సమకూరుస్తున్నారు.పరిసర గ్రామాల ప్రజల కోసం బ్యాంకింగ్ కరస్పాండెంట్ల ద్వారా సేవలు, 24 గంటల ఏటీఎం నగదు సదుపాయం,వ్యాపారుల కోసం వ్యాపార వృద్ధి రుణాలు అందుబాటులో ఉన్నాయని మేనేజర్ తెలిపారు. వినియోగదారులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :