వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో మార్క్‌ఫెడ్ ద్వారా మొక్కజొన్న కొనుగోళ్లు వేగవంతం చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్లు, వ్యవసాయ, రవాణా, సహకార, మార్కెటింగ్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.హమాలీలు, వాహనాలు, గన్ని బ్యాగుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని, కొనుగోలు చేసిన మొక్కజొన్నను గుర్తించిన గిడ్డంగుల్లో భద్రపరచాలని సూచించారు.వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ ఎం. డేవిడ్ పాల్గొని జిల్లాలో మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి కొనుగోళ్లు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని తెలిపారు.
Admin
వాస్తవ గమ్యం