Sunday, 13 September 2026 06:43:44 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

​మందమర్రిలో వైభవంగా సుందరకాండ హవనం: విశేషంగా తరలివచ్చిన భక్తులు

Date : 10 May 2026 08:47 PM Views : 923

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : ​మందమర్రి, పట్టణంలోని పాలచెట్టు క్షేత్రంలో వెలసిన పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయంలో ఆదివారం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఆలయ అర్చకులు కృష్ణ కాంత ఆచార్యులు ఆధ్వర్యంలో సుందరకాండ హవనం, నాగవల్లి దళార్పణ (తమలపాకుల అర్చన) కార్యక్రమాలను అత్యంత ఘనంగా నిర్వహించారు.ఈ పూజా కార్యక్రమాల్లో పడిదల మాధవి - సురేందర్రావు దంపతులు తమ కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వారు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు స్వీకరించారు.కార్యక్రమం సందర్భంగా అర్చకులు కృష్ణ కాంత ఆచార్యులు మాట్లాడుతూ సుందరకాండ పారాయణ ప్రాముఖ్యతను వివరించారు, సుందరకాండ పఠనం వల్ల దుష్టశక్తులు, ప్రతికూల ప్రభావాలు తొలగిపోతాయి. జీవితంలో ఎదురయ్యే క్లిష్ట సమస్యల నుంచి గట్టెక్కడానికి ఈ పారాయణం ఎంతో దోహదపడుతుందని భక్తుల బలమైన విశ్వాసం. ఈ పారాయణాన్ని వీక్షించినా, విన్నా సకల అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని పేర్కొన్నారు.హోమం కేవలం మతపరమైన ప్రక్రియే కాకుండా, దాని వెనుక బలమైన శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయని అర్చకులు తెలిపారు. పురాణ కాలం నుండి నేటి ఆధునిక యుగం వరకు ప్రకృతి సమతుల్యత కోసం, సకాలంలో వర్షాలు కురవాలని హోమాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో మాలధారణ చేసిన స్వాములు, చిన్నారులు, మహిళలు మరియు వృద్ధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. స్వామివారి విగ్రహాన్ని రంగురంగుల పుష్పాలతో మనోహరంగా అలంకరించి, వేదమంత్రాల సాక్షిగా అర్చనలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణమంతా హనుమాన్ నామస్మరణతో మారుమోగింది.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: