వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల: నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశానికి ఆటంకం కలిగించారనే ఆరోపణలపై బీజేపీ కార్పొరేటర్ల పై పోలీసులు కేసు నమోదు చేశారు. మున్సిపల్ జూనియర్ అసిస్టెంట్ అంజయ్య ఫిర్యాదు మేరకు ఈ చర్యలు తీసుకున్నారు.సోమవారం జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశాన్ని వాకౌట్ చేసిన బీజేపీ కార్పొరేటర్లు ముఖేశ్ గౌడ్, కస్తూరి నాగరాజ్, బొట్ల అనితతో పాటు కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగిన రమేశ్, జయరాం, బోరే శ్రీనివాస్, రాజ్ కుమార్, బొట్ల సత్యనారాయణ, బీర సత్యనారాయణలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. సమావేశ నిర్వహణకు అంతరాయం కలిగించినందుకే ఈ చర్యలు చేపట్టినట్లు సమాచారం.
Reporter
వాస్తవ గమ్యం