Sunday, 13 September 2026 07:32:21 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

శంకర్ పల్లి క్రేన్ ప్రమాద క్షతగాత్రులను పరామర్శించిన మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి

Date : 28 April 2026 11:19 AM Views : 171

వాస్తవ గమ్యం / తెలంగాణ / హైదరాబాదు : శంకర్ పల్లి సమీపంలో జరిగిన ఘోర క్రేన్ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న బాధితులను రాష్ట్ర కార్మిక మరియు గనుల శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి మంగళవారం పరామర్శించారు. స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి ఆసుపత్రికి వెళ్లిన మంత్రి, బాధితులకు అందుతున్న వైద్య సేవలను పర్యవేక్షించి, వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.సోమవారం కురిసిన భారీ వర్షం, బలమైన గాలుల ధాటికి ఎన్సీసి సీ లిమిటెడ్ సంస్థకు చెందిన భారీ నిర్మాణ క్రేన్ ఒక్కసారిగా పక్కనే ఉన్న షెడ్‌పై కూలిపోయింది. వర్షం నుంచి రక్షణ పొందేందుకు ఆ సమయంలో షెడ్‌లో ఆశ్రయం పొందిన వలస కార్మికులు ఈ ప్రమాదంలో చిక్కుకున్నారు. ఐదుగురు వలస కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.క్షతగాత్రులు 12 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు ఎముకలు విరిగినట్లు వైద్యులు ధృవీకరించారు.ప్రమాదం జరిగిన తీరుపై మంత్రి వివేక్ వెంకటస్వామి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, పూర్తి నివేదికను వెంటనే సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ​"ప్రభుత్వం బాధిత కుటుంబాలకు అండగా ఉంటుంది. మృతుల కుటుంబాలకు, గాయపడిన వారికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తాం. నిర్మాణ సంస్థల వద్ద భద్రతా ప్రమాణాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు."క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని, అవసరమైతే ఉన్నత స్థాయి చికిత్సకు ఏర్పాట్లు చేయాలని ఆయన వైద్యులకు సూచించారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :