వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : సింగరేణి సంస్థ పరిధిలో సెప్టెంబర్ 25, 26 తేదీల్లో నిర్వహించిన మెడికల్ బోర్డు (కార్పొరేట్ మెడికల్ బోర్డు) పరిశీలన ఫలితాలు వెలువడ్డాయి. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ విధులు నిర్వహించలేని కార్మికులకు నిర్వహించిన ఈ పరీక్షల్లో బోర్డు వైద్యులు నిబంధనల ప్రకారం పరిశీలించి అర్హులను 'మెడికల్ అన్‌ఫిట్'గా ధ్రువీకరించారు. అన్‌ఫిట్ అయిన కార్మికుల వివరాలను ఆయా డివిజన్ల పర్సనల్ విభాగానికి పంపనున్నారు.సంస్థ నిబంధనల మేరకు అన్‌ఫిట్ పొందిన కార్మికులపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు (డిపెండెంట్లకు) ఉద్యోగ ప్రక్రియకు సంబంధించిన తదుపరి కార్యాచరణ ప్రారంభం కానుది పూర్తి పేర్లు, కోల్ మైన్స్ వారీగా అర్హులైన కార్మికుల జాబితాలను సంబంధిత ఏరియా జీఎం ఆఫీసులు, అధికారిక నోటీస్ బోర్డుల్లో అందుబాటులో ఉంచారు.
Admin
వాస్తవ గమ్యం