వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మిషన్ భగీరథ పథకంలో పనిచేస్తున్న సుమారు 600 మంది కార్మికులకు గత కొన్ని నెలలుగా జీతాలు పెండింగ్‌లో ఉండటంతో, వెంటనే బకాయి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ధనోరాలోని మిషన్ భగీరథ కార్యాలయం ఎదుట కార్మికులు ధర్నా చేపట్టారు. విషయం తెలుసుకున్న ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ధర్నా స్థలానికి చేరుకుని కార్మికులకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేద కార్మికుల కష్టాన్ని ప్రభుత్వం గుర్తించాలని, జీతాలు అందక వారి కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని అన్నారు. వెంటనే మిషన్ భగీరథ ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడి, కార్మికుల పెండింగ్ జీతాల సమస్యను పరిష్కరించాలని సూచించారు. కార్మికులకు న్యాయం జరిగే వరకు వారికి అండగా ఉంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
Reporter
వాస్తవ గమ్యం