Sunday, 13 September 2026 07:37:44 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

ప్రజాసేవకు ప్రతీక పోస్టుమ్యాన్ శంకర్‌లింగం

లయన్స్ క్లబ్ ఘన సన్మానం

Date : 01 July 2026 09:26 PM Views : 310

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మారుతున్న కాలంతో పాటు ఉత్తరాల సంఖ్య తగ్గినప్పటికీ, తన సేవల్లో ఎలాంటి మార్పు రానివ్వకుండా ప్రజల నమ్మకాన్ని గెలుచుకున్న మందమర్రి పోస్టుమ్యాన్ ఉప్పలంచి శంకర్‌లింగంను లయన్స్ క్లబ్ సభ్యులు ఘనంగా సన్మానించారు.ప్రజాసేవలో ఆయన చూపిన అంకితభావానికి, నిరంతర కృషికి గుర్తింపుగా క్లబ్ ప్రతినిధులు ఆయనను శాలువాతో సత్కరించి, ప్రత్యేక అభినందనలు తెలిపారు. ​ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ప్రతినిధులు మాట్లాడుతూ... నిశ్శబ్దంగా, నిరడంబరంగా సమాజానికి సేవ చేస్తూ శంకర్‌లింగం అందరికీ ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. సాంకేతికత పెరిగిన ఈ రోజుల్లోనూ ప్రతి గడపకూ నమ్మకంతో సేవలు అందించే పోస్టల్ ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకమని, శంకర్‌లింగం సేవలు చిరస్మరణీయమని ప్రశంసించారు. ​ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు, స్థానిక ప్రముఖులు మరియు సన్మాన గ్రహీత శంకర్‌లింగం అభిమానులు పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :