Sunday, 13 September 2026 07:36:41 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

వేధింపులపై నిర్భయంగా ఫిర్యాదు చేయాలి

Date : 28 June 2026 03:36 PM Views : 229

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : బహిరంగ ప్రదేశాలు, విద్యాసంస్థలు, వసతి గృహాల పరిసరాల్లో ఎలాంటి వేధింపులు ఎదురైనా మౌనంగా ఉండకుండా నిర్భయంగా షీ టీమ్‌కు లేదా పోలీసులకు ఫిర్యాదు చేయాలని షీ టీమ్ ఎస్సై ఉషారాణి పిలుపునిచ్చారు. మహిళల భద్రతకు పోలీసు శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ప్రతి ఫిర్యాదుపై తక్షణమే స్పందించి బాధితులకు అండగా నిలుస్తామని ఆమె స్పష్టం చేశారు.పట్టణంలోని బాలికల వసతి గృహంలో మహిళల భద్రత, చట్టపరమైన హక్కులపై నిర్వహించిన ప్రత్యేక అవగాహన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మహిళలు, విద్యార్థినులు తమపై జరిగే వేధింపులను చిన్నవిగా భావించి నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. సమయానికి ఫిర్యాదు చేస్తే నిందితులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా కానిస్టేబుళ్లు జ్యోతి, సతీష్ మాట్లాడుతూ.. మహిళల రక్షణ కోసం షీ టీమ్ నిరంతరం పనిచేస్తోందని తెలిపారు. ఈవ్‌టీజింగ్, సైబర్ వేధింపులు, సోషల్ మీడియా ద్వారా జరిగే మోసాలు, అసభ్యకర సందేశాలు, వెంటపడటం వంటి ఘటనలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో పోలీసు హెల్ప్‌లైన్‌లు, షీ టీమ్ సేవలను వినియోగించుకోవాలని కోరారు.కార్యక్రమంలో విద్యార్థినులకు మహిళల భద్రతకు సంబంధించిన చట్టాలు, షీ టీమ్ విధులు, ఫిర్యాదు చేసే విధానం, స్వీయ రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. వేధింపులకు పాల్పడే వ్యక్తులపై ఎలాంటి ఉపేక్ష ఉండదని, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

BEERAM SHARATH CHANDHRA

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :