వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : రెబ్బెన మండలంలోని ఎస్ వి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో లైన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా పదవి విరమణ పొందిన ఉపాధ్యాయులు ఎస్సార్ కి ప్రభాకర్ ను ఘనంగా సన్మానించారు. అనంతరం ముఖ్య అతిథిగా వచ్చిన గ్రామ సర్పంచ్ దుర్గం భరద్వాజ్ మాట్లాడుతూ నిస్వార్థంతో ఉపాధ్యాయుడిగా పని చేసి పదవి విరమణ పొందిన ఎస్ఆర్కె ప్రభాకర్కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రభాకర్ ఆధ్వర్యంలో ఎంతోమంది విద్యార్థులను డాక్టర్లు, యాక్టర్లుగా, ఇంజనులుగా పోలీసు అధికారులుగా తయారు చేసిన ఘనత ప్రభాకర్ దక్కిందని అన్నారు. మన రాష్ట్రంలోనే కాకుండా దేశంలో ప్రపంచంలో అతని విద్యార్థులు సమాజంలో సేవ చేయడం ఎంతో అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి అధ్యక్షులు దీకొండ సంజీవ్ కుమార్ ఉపాధ్యాయులు శ్రీనివాస్, మంజు, సురేష్, నీలిమ, మల్లేశ్వరి, విజయ కుమారి, అరుణ, రూప, మేఘన, మహేందర్ లతోపాటు తదితరులు ఉన్నారు.
Reporter
వాస్తవ గమ్యం