వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : వన్యప్రాణి సంరక్షణ వారోత్సవాల్లో భాగంగా జైపూర్ కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం లో అటవీ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు క్విజ్, డ్రాయింగ్ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని, అడవులు, వన్యప్రాణులు, పర్యావరణ పరిరక్షణ మరియు జీవవైవిధ్యానికి సంబంధించిన వివిధ ప్రశ్నలకు చక్కటి సమాధానాలు అందించారు. విద్యార్థులలో అటవీ సంపద, వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన పెంపొందించేలా ఈ కార్యక్రమం ఎంతో ఆసక్తికరంగా సాగింది.పోటీలలో పాల్గొన్న విద్యార్థులకు అటవీ శాఖ తరఫున సర్టిఫికెట్లు అందజేసి వారిని అభినందించారు. విద్యార్థుల సృజనాత్మకతను వెలికితీసేలా నిర్వహించిన డ్రాయింగ్ పోటీ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ రామకృష్ణ సర్కార్, బీట్ ఆఫీసర్లు వసంతలక్ష్మి , కే.రమేష్, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం ప్రిన్సిపల్ ఫణిబాల, ఇతర ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం