వాస్తవ గమ్యం / తెలంగాణ / నిర్మల్ : నిర్మల్ జిల్లా కడం మండలం ఇస్లాంపూర్ గ్రామ పరిధిలోని కొలాంగూడ గిరిజనులకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని ఫారెస్ట్ అధికారులు అడ్డుకోవడంపై సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. కొలాంగూడలో 31 మంది పేద గిరిజనులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, పునాదులు తవ్వి పిల్లర్లు వేసే దశలో టైగర్ జోన్ పేరిట అటవీ శాఖ అధికారులు పనులను నిలిపివేశారని పార్టీ ఉమ్మడి జిల్లా కార్యదర్శి నంది రామయ్య తెలిపారు. ఇళ్లు లేక దాదాపు ఏడాది కాలంగా గిరిజన కుటుంబాలు ఎండకు, వానకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అటవీ అధికారుల వేధింపులు ఆపి, ఇళ్ల నిర్మాణాలు కొనసాగేలా చర్యలు తీసుకోవాలని, అలాగే లబ్ధిదారులకు రావాల్సిన 31 ఇళ్ల బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సిడాం సోనేరావ్, సిడాం భీమ్ రావ్, ఆత్రం రాజు తదితరులు పాల్గొన్నారు.
Admin
వాస్తవ గమ్యం