వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : ఆసిఫాబాద్ ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని ఆసిఫాబాద్, రెబ్బెన,తిర్యాణి మండలాల్లో అంగన్వాడీ టీచర్, హెల్పర్ పోస్టులకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న మహిళా అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన నవంబర్ 4 నుంచి 7 వరకు సీడీపీఓ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు ప్రాజెక్టు అధికారి డి. రేణుక తెలిపారు.ఆసిఫాబాద్ మండల అభ్యర్థులకు నవంబర్ 4, 5 తేదీల్లో, రెబ్బెన మండలానికి 6న, తిర్యాణి మండలానికి 7న పరిశీలన ఉంటుంది. అభ్యర్థులు విద్యార్హత, వయస్సు, స్థానికత, కుల ధ్రువీకరణ పత్రాలతో పాటు ఇతర ధ్రువపత్రాల అసలు ప్రతులు, ఆన్లైన్ దరఖాస్తు,గెజిటెడ్ అధికారి ధ్రువీక రించిన రెండు సెట్ల జిరాక్స్ ప్రతులను తీసుకురావాలని ఆమె సూచించారు.
Reporter
వాస్తవ గమ్యం